వివాహేతర సంబంధం: మైనర్‌ బాలుడే నిందితుడు

23 Oct, 2021 13:53 IST|Sakshi

సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరు బనశంకరిలోని యారబ్‌నగరలో మహిళా టైలర్‌ అఫ్రినా ఖానం (28) హత్య కేసు మిస్టరీ వీడింది. మంగళవారం ఆమె ఇంట్లో చొరబడిన దుండగుడు కత్తెరతో పొడిచి చంపి, మృతదేహంపై బట్టలు వేసి నిప్పుపెట్టి పరారయ్యాడు. భర్త, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా పలు వాస్తవాలు బయటపడ్డాయి. ఆమె బంధువైన పీయూసీ విద్యార్థే (17) నిందితుడని తేలింది. అఫ్రినా ఇంటి పక్కనే నిందితుని కుటుంబం కొత్త ఇల్లు కడుతోంది.

అబ్బాయి ఆమె ఇంటికి వచ్చి వెళ్తూండగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లి జీవిద్దామని హతురాలు ఆ అబ్బాయిని ఒత్తిడి చేయగా, అతడు నిరాకరించాడు. అంతేగాక డబ్బు ఇవ్వాలని ఆమెను అతడు పీడించాడు. దీంతో గొడవ జరిగింది, అబ్బాయి కత్తెర తీసుకుని ఆమెను పొడిచి చంపి పరారయ్యాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.  

చదవండి: Shocking: పట్టపగలు ఇంట్లో ప్రవేశించి.. మహిళను..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు