ఇంటి ముందు కల్లేపు చల్లే విషయంపై గొడవ.. స్నేహితుడితో కలిసి..

3 Jul, 2022 16:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వేలూరు: తిరుపత్తూరు జిల్లా సెవ్వాత్తూరు రైల్వే స్టేషన్‌ సమీపంలోని పుదూరు గ్రామానికి చెందిన సెల్వరాజ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య రామరోజ అలియాస్‌ రాణి(50). ఈమె కుమారుడు ఏయుమలై, భార్య హంస దంపతులకు 10 నెలల కుమార్తె ఉంది. ఇదిలా ఉండగా గత నెల 29వ తేదీన సెల్వరాజ్‌ డ్యూటీకి వెళ్లాడు. ఇంటి హాలులో రాణి, తన గదిలో కోడలు హంస నిద్రించారు. గురువారం ఉదయం రాణి రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఆ సమయంలో హంస తరచూ ఒక యువకుడితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు గుర్తించి.. ప్రశ్నించారు. హంస హైస్కూ ల్‌ చదువుతున్న సమయంలో గున్నచ్చి మోటూరు గ్రామానికి చెందిన కార్తికేయన్‌ కలిసి చదువుకుంది. గత నెల 30వ తేదీ రాత్రి అత్త కోడలి మధ్య ఉదయం ఇంటి ముందు కల్లేపు చల్లే విషయంపై వాదనలు జరిగాయి. దీంతో కోడలు హంస ఆగ్రహం చెంది తన స్నేహితుడు కార్తికేయన్‌ను రప్పించి అత్త రాణిని హత్య చేసింది. మృత దేహాన్ని అక్కడే వదిలి పెట్టి ఏమీ తెలియనట్లు నాటకం ఆడారని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. 

చదవండి: ఉద్యోగం లేదు.. పెళ్లి కాలేదు.. 24వ అంతస్తు నుంచి దూకిన యువతి

మరిన్ని వార్తలు