భర్త మృతి చెందడంతో.. డిప్రెషన్‌లో

10 Aug, 2020 07:29 IST|Sakshi
మృతురాలు శిరీష ( ఫైల్‌)

మనస్థాపంతో భార్య మృతి 

అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలు 

పటాన్‌చెరు టౌన్‌ : భర్త మృతి చెందడంతో అప్పటి నుంచి డిప్రెషన్‌లోకి వెళ్లిన భార్య ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌ పరిధిలోని బీరంగూడ సమీపంలో తిరుమల ఆసుపత్రిలో నర్సుగా శిరీష రెడ్డి (31) పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రెండున్నరేళ్ల క్రితం భర్త రమేశ్‌ గుండెపోటుతో మృతి చెందాడు.వీరికి ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు ప్రియ, చిన్న కూతురు కౌశిక, మూడేళ్ల కుమారుడు హిమాష్‌ కలడు.

భర్త మృతి చెందినప్పటి నుంచి శిరీష రెడ్డి డిప్రెషన్‌కులోనై అప్పటి నుంచి మూడు సార్లు ఆత్మహత్య యత్నాలు చేసింది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో చికిత్స కోసం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.  రెండున్నరేళ్ల క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి మృతి చెందడంతో పిల్లులు ముగ్గురు అనాథలుగా మారారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు