ఎలుకల మందు తిని వివాహిత ఆత్మహత్య

28 Jul, 2022 16:29 IST|Sakshi
వెంకటేశ్వరి (ఫైల్‌)

ప్రకాశం: ఎలుకల మందు తిని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మర్రిపూడి నడిగడ్డకు చెందిన ఆకుమళ్ల తిరుమలయ్య కుమార్తె వెంకటేశ్వరి(22)ని మూడేళ్ల క్రితం బేస్తవారిపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రమణయ్యతో వివాహమైంది. అయితే కొద్ది రోజుల్లోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి నిత్యం గొడవలు జరుగుతుండటంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వెంకటేశ్వరి పుట్టింట్లో ఉంటోంది. 

ఈ క్రమంలో మనస్తాపం చెందిన వెంకటేశ్వరి ఈ నెల 21న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తినింది. కుటుంబసభ్యులు గమనించి ఒంగోలులోని ప్రైవేట్‌ వైద్యశాలలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై అంకమ్మరావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. మృతురాలి తండ్రి తిరుమలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని తహసీల్దార్‌ జి.విజయలక్షి్మ, వీఆర్‌ఓ శామ్యేలు పరిశీలించారు. 

మరిన్ని వార్తలు