భర్తతో విడాకులు.. మరో వ్యక్తితో రెండో పెళ్లి.. చివరికి ఏం జరిగిందంటే?

9 Jun, 2022 10:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నందిగామ(ఎన్టీఆర్‌ జిల్లా): వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నందిగామ పట్టణ శివారులో బుధవారం జరిగింది. ఎస్‌ఐ పండు దొర కథనమ మేరకు.. విశాఖపట్నానికి చెందిన తనూజకు గతంలో చందర్లపాడు మండలం మునగాల పల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే అతనితో విడాకులు తీసుకుంది. 2015లో నందిగామ పట్టణానికి చెందిన షేక్‌ ఖాదర్‌వలి బాషాను తనుజ వివాహం చేసుకుంది.
చదవండి: ఉద్యోగంలో చేరిన పది  రోజులకే యువతి మృతి.. ఏం జరిగిందంటే?

అప్పటి నుంచి తన పేరుకు ఫరహాన ఫాతిమాగా మార్చుకుంది. పట్టణ శివారు డీవీఆర్‌ కాలనీలో భర్తతో కలిసి నివసిస్తోంది. ఖాదర్‌వలి బాషా ఓ ప్రైవేట్‌ డ్రైవింగ్‌ స్కూల్‌లో డ్రైవర్‌గా పని చేస్తాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తల్లిదండ్రులు తనతో మాట్లాడటం లేదన్న మనస్తాపంతో ఫాతిమా (తనూజ) (35) బుధవారం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు