ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ అదృశ్యం.. ఫోన్‌ చేయగా

19 Dec, 2021 17:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌(భాగ్యనగర్‌కాలనీ): ఇంట్లో నుంచి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో జీతాబాయి (23), వెంకటేష్‌ నాయక్‌లు నివాసముంటున్నారు.

ఈ నెల 16న ఉదయం వెంకటేష్‌ నాయక్‌ పని నిమిత్తం బయటకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా భార్య జీతాబాయి కనిపించలేదు. దీంతో అత్తమామలకు ఫోన్‌ చేసి ఆరాతీయగా తమవద్దకు రాలేదని సమాధానం చెప్పారు. జీతాబాయికు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌లో ఉంది. దీంతో ఆమె కోసం ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: (ఒకే కాలేజీ ఫేస్‌బుక్‌లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి..)

మరిన్ని వార్తలు