‘తలపోటుగా ఉంది.. మాత్ర తెచ్చుకుంటా’.. ఇంతలోనే బిగ్‌ షాక్‌

18 Sep, 2022 20:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జంగారెడ్డిగూడెం(ఏలూరు జిల్లా): వివాహిత అదృశ్యంపై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.సాగర్‌బాబు చెప్పారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన టి.రామాజంనేయులుకు, వెంకటరామన్నగూడెం గ్రామానికి చెందిన ప్రభావతితో ఐదు నెలల క్రితం వివాహమైంది. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం తలపోటుగా ఉంది, మాత్ర తెచ్చుకుంటానని ప్రభావతి భర్త రామాంజనేయులకు చెప్పి బయటకు వెళ్లింది.
చదవండి: విషాదం: కుటుంబాన్ని వీడలేక.. డ్యూటీ చేయలేక.. 

ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల విచారించగా, స్కూల్‌ సమీపంలో ఫోన్‌ మాట్లాడుతూ ఆటో ఎక్కి వెళ్లిందని, ఆటోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు అతనికి చెప్పారు. భార్య నంబర్‌కు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వస్తుండటంతో బంధువులకు, ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. వారి ఇళ్లకు కూడా వెళ్లలేదని తెలుసుకున్నాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో శనివారం భర్త ఫిర్యాదు చేశాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.   

మరిన్ని వార్తలు