బీచ్‌ రోడ్డులో చున్నీ, చెప్పులు.. అసలు ఏం జరిగింది?

21 Sep, 2022 15:38 IST|Sakshi
అదృశ్యమైన లావణ్య (పాతచిత్రం)

కాకినాడ రూరల్‌: మండలంలోని నేమాం గ్రామానికి చెందిన వివాహిత రేవు లావణ్య అదృశ్యమైంది. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగికి చెందిన లావణ్యకు నాలుగేళ్ల క్రితం నేమాం గ్రామానికి చెందిన శ్రీనుతో వివాహం జరిగింది. వీరికి ఇంకా సంతానం లేదు. అత్తింటి వద్దే ఉంటున్న లావణ్య మంగళవారం తెల్లవారుజాము నుంచి అదృశ్యమైంది. నాలుగు గంటలకు నిద్ర లేచి చూడగా భార్య కనిపించలేదని శ్రీను చెప్పాడు.
చదవండి: హోటల్‌ రూమ్‌లో లవర్‌తో భర్త రాసలీలలు.. భార్య ఎంట్రీతో సీన్‌ రివర్స్‌!

రాజవొమ్మంగిలోని లావణ్య పుట్టింటి వారికి విషయం చెప్పడంతో వారు తిమ్మాపురం పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పిల్లలు పుట్టలేదని, కట్నం కావాలని తన కుమార్తెను భర్త, అత్త వేధించడంతో ఆత్మహత్య చేసుకునేందుకు లావణ్య ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటుందని ఆమె తల్లి లంకాడి వెంకటలక్ష్మి ఆరోపించింది.

ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై నాగార్జునరాజు వారికి నచ్చజెప్పి, అదృశ్యం కేసు నమోదు చేశారు. లావణ్య ఆచూకీ కోసం నేమాంతో పాటు నేమాం – సూర్యారావుపేట బీచ్‌లో గాలించారు. బీచ్‌లో రోడ్డు పక్కన ఆమె చున్నీ, చెప్పులు గుర్తించారు. సముద్రంలోకి దిగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సముద్ర తీరంలో గాలింపు చేపట్టారు.  

మరిన్ని వార్తలు