పెళ్లయిన నాటి నుంచి పుట్టింటికి పంపించని భర్త.. దీంతో భార్య..

11 May, 2022 07:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ వివాహిత అదృశ్యమైన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్‌కు చెందిన మౌనికకు గతేడాది కొండాపూర్‌కు చెందిన ధనుంజయ్‌తో వివాహమైంది. నాటి నుంచి ఆమెను భర్త పుట్టింటికి పంపించలేదు. ఈ క్రమంలో మౌనిక తొమ్మిది రోజుల క్రితం తన బాబాయ్‌ గోపాల్‌ ఇంట్లో జరిగిన శుభకార్యానికి భర్తకు చెప్పకుండానే హాజరైంది.

ఈ నెల 3న తన అత్తింటికి వెళ్తున్నానని మౌనిక బయలుదేరింది. అదే రోజు సాయంత్రం గోపాల్‌ ఆమె కోసం ఆరా తీయగా ఇంటికి చేరుకోలేదని తెలిసింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో ఆమె జాడ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: (ప్రియురాలితో గొడవపడి వ్యక్తి ఆత్మహత్య) 

మరిన్ని వార్తలు