ఆరేళ్లక్రితం వివాహం.. భర్తే అత్తమామలకు ఫోన్‌చేసి

19 May, 2022 09:09 IST|Sakshi
రేఖ (ఫైల్‌)

సాక్షి, పలమనేరు: వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బుధవారం గంగవరం మండలంలోని మబ్బువారిపేటలో జరిగింది. పోలీసుల కథనం మేరకు, గ్రామానికి చెందిన శివతో పలమనేరు మండలం గుండ్లపల్లికి చెందిన రేఖకు ఆరేళ్లక్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. శివ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవడేవాడు. దీనికితోడు వరకట్న వేధింపులు మొదలైనట్లు బాధితురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం వారి ఇంటిలోని హాలులో రేఖ(23) ఉయ్యాలకొక్కీకి ఉరేసుకొని మృతి చెందింది. భర్తే అత్తమామలకు ఫోన్‌చేసి రేఖ ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. అయితే ఆత్మహత్య చేసుకున్న తీరు అనుమానించేలా ఉండడంతో మృతురాలి కుటుంబీకులు అతడిపైనే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిందితున్ని గంగవరం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా రేఖది హత్యా లేక ఆత్మహత్య అనే విషయం తెలుస్తుందని గంగవరం ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. 

చదవండి: (3 Burnt Alive: హాసిని అంటే చాలా ప్రేమ.. డాడీ లేడన్న విషయం ఎలా చెప్పాలో)

మరిన్ని వార్తలు