విషాదం: అత్తింటి వేధింపులతో పురుగుల మందు తాగిన మహిళ

17 Aug, 2021 10:16 IST|Sakshi
అనూష (ఫైల్‌)

సాక్షి, నేరేడుచర్ల(నల్లగొండ): కుటుంబ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఓ మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నేరేడుచర్ల ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పత్తేపురం గ్రామానికి చెందిన పగిడిమర్రి అనూష(21)ను పెద్దమ్మ, పేదనాన్నలు అయిన పగిడిమర్రి సమాదానం, పగిడిమర్రి నగేష్‌ సాదుకున్నారు.

అనూషను వారు వారి కుమారుడు పగిడిమర్రి అంజయ్య, బాబాయి పగిడిమర్రి విజయ్‌ కుటుంబ సభ్యులందరూ అనూషను పనిమనిషిగా చూడటంతో పాటు వ్యవసాయం, ఇంటి పనులకు పరిమితం చేసి తరుచూకొట్టడం, తిట్టడం, చిత్రహింసలకు గురి చేయడంతో వేధింపులను తట్టుకోలేక ఈనెల 14న పురుగుల మందు తాగింది. దీంతో పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్‌ ఐ తెలిపారు. తండ్రి   సైదులు ఇచ్చిన ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు