టీలో పొడి ఎక్కువైందని తిట్టిన అత్త, దీంతో కోడలు..

4 May, 2021 14:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గోల్కొండ(హైదరాబాద్‌): అత్త కోపగించుకుందని ఓ కోడలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గోల్కొండ రేషంబాగ్‌కు చెందిన సయ్యద్‌ హబీబ్‌ భార్య బీబీ (24). ఆమె తన అత్త సతీయా బేగంతో కలిసి రేషం బాగ్‌లో ఉంటోంది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అత్తా సతియా బేగం చిన్న విషయానికే కోపగించుకుంటోందని  బీబీ పలుమార్లు భర్తకు తెలిపింది.

ఇదిలాఉండగా సోమవారం ఉదయం సతీయా బేగంతన కోడలు బీబీకి టీ తెమ్మని చెప్పింది. దీంతో బీబీ ఇంట్లో టీ తయారు చేసి అత్తకు ఇచ్చింది. కాగా టీ లో  పొడి ఎక్కువైందని సతీయా బేగం కోడలిపై విరుచుకుపడింది. కాగా  అత్త చిన్న విషయానికే తనను దూషించినందుకు బీబీ మనస్తాపం చెంది తన గదిలోకి వెళ్లి చున్నీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాని స్వాధీనం చేసుకుని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు