అప్పుడేమో ప్రేమ కావాలి.. ఇప్పుడు పైసలు కావాలి

19 Apr, 2021 10:01 IST|Sakshi

కామారెడ్డి: ఆమె ప్రేమ పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులకు భర్త కట్నం తీసుకు రావాలని వేధిస్తుండడంతో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని ఎన్‌జీవోఎస్‌ కాలనీలో నివాసం ఉండే నూకలపాటి లావణ్య అదే కాలనీకి చెందిన దేవనంద్‌ ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

అప్పటి నుంచి మేడ్చల్‌లో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులు అంతాబాగానే గడిచింది. ఆ తర్వాత దేవానంద్‌ రూ.5 లక్షలు కట్నం తీసుకురావాలని లావణ్యను వేధించసాగాడు. లావణ్య గర్భం దాల్చడంతో అక్టోబర్‌లో తల్లిగారింటికి వచ్చింది. కట్నం తీసుకువస్తేనే కాపురానికి తీసుకువెళ్తానని తన భర్త వేధిస్తున్నాడని ఆదివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో మధుసూదన్‌ తెలిపారు. 

( చదవండి: డబ్బు ఇవ్వలేదని.. కన్నతండ్రినే బకెట్‌తో కొట్టి.. )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు