మెక్సికోలో కాల్పుల మోత.. మేయర్‌ సహా 18 మంది మృతి

6 Oct, 2022 20:34 IST|Sakshi

మెక్సికో సిటీ: మెక్సికోలో మరోసారి తుపాకీ మోతలతో అట్టుడికింది. శాన్ మిగ్యుల్ టోటోలాపాన్ పట్టణంలోని సిటీ హాల్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో పట్టణ మేయర్ కాన్రాడో మెండోజా, ఆయన తండ్రి జువాన్ కూడా ఉన్నారని స్థానిక మీడియాలు తెలిపాయి. కాల్పుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

మేయర్‌ హత్య కోసమే..
కాల్పులకు పాల్పడి దుండగులు ‘లాస్ టెకిలెరోస్’ డ్రగ్స్‌ ముఠాకు చెందినవారిగా అధికారులు భావిస్తున్నారు. మేయర్‌ను హతమార్చాలనే లక్ష్యంతోనే వారు భవనం లోపలికి ప్రవేశించి, ముందస్తు ప్రణాళిక ప్రకారం వరుస దాడులు చేసినట్లు పేర‍్కొన్నారు. భద్రతా బలగాలు నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకుగానూ అంతకుముందే భారీ వాహనాలతో రహదారులను బ్లాక్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. మేయర్ మృతిపై గెరెరో గవర్నర్‌ ఎవెలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఆర్‌డీ పార్టీ సైతం ఈ ఘటనను ఖండించింది. పిరికిపంద చర్యగా అభివర్ణించింది. మరోవైపు.. నిందితులను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వం సైన్యాన్ని దించింది.

ఇదీ చదవండి: రష్యాకు షాక్‌.. విలీన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకుంటున్న ఉక్రెయిన్‌!

మరిన్ని వార్తలు