మన ప్రేమ గుర్తుగా కొన్ని ఖరీదైన వస్తువులు పంపుతున్నానంటూ..

6 Aug, 2021 09:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హిమాయత్‌నగర్‌: వివాహం కోసం ప్రొఫైల్‌ని క్రిష్టియన్‌ మ్యాట్రిమోనిలో అప్‌లోడ్‌ చేసిన యువతికి భారీ టోకరా వేశాడు సైబర్‌ నేరగాడు. తాను యూకేలో జనరల్‌ ఫిజీషియన్‌ అంటూ ఆదర్శనగర్‌కు చెందిన నర్సు నాగమణికి ఇటీవల ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా చేస్తున్నానంటూ ఈమె పరిచయం పెంచుకుంది. ఇద్దరి మధ్య రోజు రోజుకు మాటలు పెరిగాయి. ఈ ఏడాది హైదరాబాద్‌లోనే ఆసుపత్రి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నానని నాగమణిని నమ్మించాడు. డిసెంబర్‌ నాటికి భారత్‌కు వస్తున్నానని.. అయితే ఈలోపు మన ప్రేమ గుర్తుగా కొన్ని ఖరీదైన వస్తువులు పంపుతానన్నాడు.

రెండు రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారులమంటూ నాగమణికి ఓ వ్యక్తి కాల్‌ చేశాడు. మీకు యూకే నుంచి ఖరీదైన గిఫ్ట్‌లు వచ్చాయని, వాటిని సొంతం చేసుకోవాలంటే ఛార్జీస్‌ చెల్లించాల్నాడు. గుడ్డిగా నమ్మిన నాగమణి పలు దఫాలుగా రూ.5 లక్షలు నగదును ట్రాన్స్‌ఫర్‌ చేసింది. డబ్బు చేతికి అందినాక ఫోన్‌ మాట్లాడటం మానేశాడు. దీంతో అనుమానం వచ్చి ఆమె ఆరా తీయగా..అది ఫేక్‌ కాల్‌ అయ్యి ఉంటుందని ఇరుగు పొరుగు వారు చెప్పారు. దీంతో గురువారం సిటీ సైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎన్‌ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు