Measles Outbreak: వణికిస్తున్న ‘మీజిల్స్‌’ వ్యాధి .. ఆస్పత్రుల్లో 1,071 మంది.. ఎవరికి ప్రమాదం?

17 Nov, 2022 11:58 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబైలో ఇన్‌ఫెక్షన్‌ డిసీస్‌ మీజిల్స్‌ వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తోంది. ముంబైలో సోమవారం ఒక్క రోజే 142 రోగులను గుర్తించారు. అదే విధంగా మంగళవారం రాత్రి వరకు ఆ వ్యాధి లక్షణాలున్న 171 మంది కొత్త రోగులు వివిధ ఆస్పత్రుల్లో చేరారు. దీంతో మొత్తం రోగుల సంఖ్య 1,071కి చేరింది. అందులో ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో 68 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మొత్తం ఏడుగురు పిల్లలుండగా, అందులో ఐదుగురు మీజిల్స్‌ అనుమానిత మృతులున్నారు.

ఇద్దరు ఇన్‌ఫెక్షన్‌ డిసీస్‌తో మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. మిగతా ఐదుగురు పిల్లలు ఎలా చనిపోయారనేది మూడు రోజుల్లో నివేదిక కానుంది. మొత్తం ఏడుగురు మృతుల్లో కస్తూర్బా ఆస్పత్రిలో నల్గురు, ఇద్దరు రాజావాడి ఆస్పత్రిలో, మరొకరు ఇంటి వద్ద మృతి చెందారు. వీరంతా అక్టోబరు 26వ తేదీ నుంచి నవంబర్‌ 16 మధ్యలో మృతి చెందినట్లు ఆరోగ్య శాఖలో నమోదైంది.  

ముంబైలోని ఎనిమిది బీఎంసీ వార్డుల్లో ఉన్న మురికివాడల్లో ఈ వ్యాధి లక్షణాలున్న పిల్లలను అత్యధికంగా గుర్తించారు. ఈ వార్డుల్లో 142 మంది రోగులుండగా అందులో ఒక్క మాన్‌ఖుర్ద్‌ రీజియన్‌లో 44 మంది పిల్లలున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభు త్వం నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం పర్యటిస్తోంది. తూర్పు, పశ్చిమ గోవండీ, బైకళ, కుర్లా, వడాల, ధారావి తదితర ఎనిమిది వార్డుల్లో ఇన్‌ఫెక్షన్‌ డిసీస్‌ తొందరగా వ్యాప్తి చెందుతోంది. ఈ రీజియన్లను హై రిస్క్‌ ప్రాంతాలుగా ప్రకటించారు.

మురికివాడల్లో ఈ వ్యాధి లక్షణాలున్న మరికొంత మంది పిల్లలు కూడా ఉండవచ్చనే అనుమానంతో ప్రతీ గుడిసెలో సోదా చేయడం ప్రారంభించినట్లు బీఎంసీ ఆరోగ్య శాఖ కార్యనిర్వాహక అధికారి డా.మంగల గోమారే తెలిపారు. ముంబైలో అనేక మంది పిల్లలకు ఎం.ఆర్‌.–1, ఎం.ఎం.ఆర్‌–2 వ్యాక్సినేషన్‌ లభించలేదని అధ్యయనంలో బయటపడింది. దీంతో అదనంగా వ్యాక్సినేషన్‌ శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నట్లు గోమారే తెలిపారు.  
చదవండి: గోఖలే వంతెన త్వరలో కూల్చివేత 

ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు 
ఇదిలాఉండగా రోజురోజుకూ పిల్లల్లో పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్‌ రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కస్తూర్బా ఆస్పత్రిలో మూడు వార్డులు ప్రత్యేకంగా రిజర్వు చేసి ఉంచారు. అందులో 83 సాధారణ బెడ్లు, 10 ఐసీయూ బెడ్లు, ఐదు వెంటిలేటర్‌ బెడ్లు సమకూర్చి సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా ఉప నగరాల్లోని గోవండీ, మాన్‌ఖుర్‌్ధ, కుర్లా తదితరా ప్రాంతాల్లో పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని శతాబ్ధి ఆస్పత్రిలో 10 బెడ్లు ప్రత్యేకంగా సమకూర్చి ఉంచారు. అంతేగాకుండా గోవండీలోని మెటరి్నటి హోంలో ఇన్‌ఫెక్షన్‌ డిసీస్‌ రోగులను చేర్చుకునే వ్యవస్ధ చేయడంతో పాటు ఐసొలేషన్‌ సెంటర్‌ నెలకొల్పాలని భావిస్తున్నట్లు బీఎంసీ పరిపాలన విభాగం స్పష్టం చేసింది.

మరోపక్క ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే మంగళవారం బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌సింగ్‌ చహల్‌తో ఫోన్‌లో చర్చించారు. ఆరోగ్య శాఖ తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు. ఆస్పత్రుల్లో ఆ వ్యాధి నివారణకు అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యాధి విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శిందే పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంతోపాటు అధ్యయనం పనులు పూర్తి చేయాలని నిర్ధేశించారు. సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులతో కూడా శిందే చర్చించారు. అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు, ఇతర సిబ్బందికి సూచించారు.  

లక్షణాలు, వ్యాప్తి.. 
మీజిల్స్‌ అనేది వైరస్‌ వల్ల కలిగే అత్యంత అంటువ్యాధి. ఇది సోకిన వ్యక్తి యొక్క ముక్కు, నోరు లేదా గొంతులో కనిపిస్తుంది. ఇది మోరిబిలివైరస్‌ వల్ల కలిగే వైరల్‌ ఇన్ఫెక్షన్‌. ఇది మానవులకు మాత్రమే సోకుతుంది. మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది. దగ్గు మరియు తుమ్ము సమయంలో వ్యాధి సోకిన వ్యక్తులు వదిలే శ్వాసకోశ బిందువుల ద్వారా ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుంది. డాక్టర్లు ఈ వ్యాధి  లక్షణాల గురించి మాట్లాడుతూ, ఇన్ఫెక్షన్‌ తీవ్రమైన రినైటిస్‌ మరియు కండ్లకలక (ఎర్రటి కళ్ళు) మరియు కంటి ఉత్సర్గతో పాటు అధిక–స్థాయి జ్వరంతో లక్షణాలు ప్రారంభమవుతాయి. జ్వరం నాల్గవ రోజుకి తగ్గుతుంది. చెవులు, ముఖం నుండి మొదలై పొత్తికడుపు వరకు దద్దుర్లు కనిపిస్తాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఐదు శాతం వరకు తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి, టీకాలు వేసుకోని పిల్లలలో మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. 
చదవండి: భయంకర దృశ్యాలు.. డ్రైవర్‌ వేధింపులు.. కదులుతున్న ఆటో నుంచి దూకడంతో

ఎవరికి ప్రమాదం? 
‘‘తట్టు సాధారణంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను, గర్భిణీలను ప్రభావితం చేస్తుంది. వారి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే మరియు ఈ వ్యక్తులు తగిన సమయంలో టీకాలు వేయకపోతే, వారు ఈ వ్యాధిబారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వారు కమ్యూనిటీలలోని బాధిత వ్యక్తులతో పరిచయంలోకి వస్తే, వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. వ్యాధి తీవ్రమైతే మధ్య చెవి ఇన్‌ఫెక్షన్‌లు, న్యుమోనియా, మెదడు ఇన్‌ఫెక్షన్‌/ఎన్‌సెఫాలిటిస్‌ శాశ్వత వినికిడి లోపం మరియు మూర్ఛ, అతిసారం, పోషకాహార లోపం, మరియు క్షయవ్యాధిని తిరిగి ప్రేరేపించడం వంటి వాటికి దారి తీయవచ్చు.

 కొన్నింటిని చెప్పాలంటే, ఈ సమస్యలలో కొన్ని ప్రాణాపాయకరమైనవి కూడా ఉన్నాయి. మీజిల్స్‌ వ్యాక్సిన్‌ మీజిల్స్‌ను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది మరియు ఇమ్యునైజేషన్‌ షెడ్యూల్‌ ప్రకారం ఇవ్వాలి. తట్టు నివారణకు వాక్సిన్‌ ఉత్తమ మార్గం. వ్యాధి స్వల్పంగా ఉంటుంది మరియు మీజిల్స్‌ను అభివృద్ధి చేసే టీకాలు వేసిన పిల్లలలో సంక్లిష్టత రేటు తక్కువగా ఉంటుంది.

ఇది 15 నెలలు మరియు 4–5 సంవత్సరాలలో బూస్టర్‌తో తొమ్మిది నెలలకు ప్రారంభించబడుతుంది. ఇది గవదబిళ్లలు, రుబెల్లా, కొన్నిసార్లు చికెన్‌పాక్స్‌ వ్యాక్సిన్‌తో కలిపి ఉంటుంది’ అని డాక్టర్లు చెబుతున్నారు. నివారణ చికిత్స లేనప్పటికీ, ఇది ప్రాణాంతకమైన స్వీయ–పరిమితి సంక్రమణం. వ్యాక్సిన్‌ ద్వారా పూర్తిగా అదుపుచేసే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు