భార్య మరో వ్యక్తితో పోయిందని.. భర్త ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని..

12 Oct, 2021 19:41 IST|Sakshi
వివరాలు తెలుపుతున్న సీఐలు పరశురామ్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్‌

జంట హత్య కేసుల్లో నిందితుడి అరెస్ట్‌ 

సాక్షి, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లాలో జరిగిన  జంట మహిళల హత్య కేసుల్లో సిద్దిపేట టూటౌన్‌ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట టూటౌన్‌ సీఐ పరశురామ్‌గౌడ్, త్రీటౌన్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..మెదక్‌ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన షేక్‌ షాబుద్దీన్‌ (43) కలాయి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో తన మొదటి భార్య మోసం చేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని,  ఈ విషయంలో వారి బంధువుల్లో ఇద్దరి ప్రమేయం ఉందని వారిని హత్య చేసిన కేసుల్లో  2006లో జీవితఖైదు పడి చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
చదవండి: మహిళా హత్య: వివాహేతర సంబంధం?.. తమ్ముడి భార్యే..

రెండు నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని హత్య చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గతంలో పరిచయం ఉన్న సిద్దిపేట పట్టణం కేసీఆర్‌నగర్‌లో ఉంటున్న లక్ష్మిని తన కోరిక తీర్చలేదనే కారణంతో ఈ నెల 1వ తేదీన మెడకు చీర కొంగుతో బిగించి హత్య చేశాడు. అదే రోజు రాత్రి దుద్దెడ గ్రామంలో ఒంటరిగా ఉంటున్న మర్కూక్‌ మండలానికి చెందిన స్వరూప అంబేడ్కర్‌ విగ్రహం పక్కన ఉన్న ఓ దుకాణం ముందు ఉండగా, మద్యం మత్తులో షాబుద్దీన్‌ తన కోరిక తీర్చాలని అడగాడు. అందుకు ఆ మహిళ నిరాకరించడంతో ఆమెను రాయితో నుదిటిపై కొట్టి హత్య చేశాడు.
చదవండి: Disha Encounter: ముగిసిన సజ్జనార్ విచారణ.. అడిగిన ప్రశ్నలివే..

ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద ఉన్న కల్లు కాంపౌండ్‌లోకి కల్లు తాగడానికి నిందితుడు రావడంతో సిద్దిపేట టూటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, రెండు హత్యల వివరాలు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతురాళ్ల నుంచి దొంగిలించిన రెండు సెల్‌ ఫోన్లను నిందితుడిని నుంచి స్వా«దీనం చేసుకున్నారు.  షేక్‌ షాబుద్దీన్‌  అరెస్ట్‌ చేసి, జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు