మూత్ర విసర్జన చేశాడు.. తట్టుకోలేక రాత్రి నిద్రపోతుంటే..

9 Aug, 2021 07:47 IST|Sakshi
మాట్లాడుతున్న డీఎస్పీ

సాక్షి, సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని లక్ష్మీ కాంప్లెక్స్‌ వద్ద ఈనెల 6న కొనాపూర్‌కు చెందిన పెద్దగొల్ల పాపయ్య(65)ను తిమ్మన్న గూడెంకు చెందిన పెద్దగొల్ల బీరప్ప (32) హత్యచేశాడని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు. ఆదివారం పోలీస్‌ స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన హత్య వివరాలను వెల్లడించారు. పెద్దగొల్ల బీరప్ప ఈనెల 5న రాత్రి ట్రాక్టర్ల బ్యాటరీలను దొంగతనం చేస్తుండగా, గమనించిన పెద్దగొల్ల పాపయ్య మరికొంతమందితో కొట్టి, మూత్ర విసర్జన చేసి అవమానించాడు.

కక్ష్య పెంచుకున్న బీరప్ప 6వ తేదీ తెల్లవారుజామున కాంప్లెక్స్‌ పక్కన నిద్రిస్తున్న పాపయ్య తలపై బండరాయితో మోదీ హత్య చేశాడు. మృతుడి కుమారుడు పెద్దగొల్ల సుభాష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అనుమానితుడు బీరప్పను విచారించగా,  నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. బీరప్పను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించామని, హత్యకేసును త్వరగా ఛేదించిన ఇన్‌స్పెక్టర్‌ గూడూరి సంతోష్‌కుమార్, సిబ్బందిని డీఎస్పీ బాలాజీ అభినందించారు.  

మరిన్ని వార్తలు