ఇష్టంలేని పెళ్లి, వారానికే పుట్టింటికి.. టెక్కీ భర్త ఆత్మహత్య!

ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జీవన్‌రెడ్డి

సాక్షి, గజ్వేల్ : భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం ఉదయం గజ్వేల్‌ పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, గజ్వేల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో నివాసముండే పోతిరెడ్డి సుందరి, శౌరెడ్డిల కుమారుడు జీవన్‌రెడ్డి (28)కి మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రవళికతో గతేడాది డిసెంబర్‌ 28న గజ్వేల్‌లోని బాలఏసు చర్చిలో వివాహం జరిగింది. టెక్‌ మహింద్రలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే జీవన్‌రెడ్డి లాక్‌డౌన్‌ నుంచి ఇంటివద్దే ఉంటూ వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నాడు. వివాహం జరిగిన వారం తర్వాత ప్రవళిక తన తల్లిగారింటికి వెళ్లి తిరిగిరాలేదు.

దీంతో ప్రవళిక తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని జీవన్‌రెడ్డికి చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తన బెడ్‌రూమ్‌లో జీవన్‌రెడ్డి సెల్ఫీ వీడియో తీసి ప్రవళిక రాకపోవడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని కుటుంబ సభ్యులకు, బంధువులకు వీడియో పంపించాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే జీవన్‌రెడ్డి గది తలుపులు బద్దలుకొట్టి చికిత్స కోసం గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్‌ పేర్కొన్నారు. 

చదవండి: 
కొద్దిరోజుల్లో పెళ్లి.. అంతలోనే ప్రియుడితో కలిసి..
మహిళ నంబర్‌ను షేర్‌చాట్‌లో పెట్టి కాల్‌గర్ల్‌గా..

Author: కె. రామచంద్రమూర్తి
Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు