యువతితో దిగిన ఫొటోతో స్టేటస్‌.. భార్య చూడటంతో!

22 Apr, 2021 12:01 IST|Sakshi

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అదృశ్యం 

సాక్షి, మల్కాజిగిరి: మౌలాలి ప్రశాంత్‌నగర్‌కు చెందిన రాకేష్‌(30) రైల్వే ఉద్యోగి. ఈ నెల 18 వ తేదీ రోజువారీలాగానే సికింద్రాబాద్‌లో విధులకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతని సెల్‌ఫోన్‌ స్టేటస్‌లో మరొక అమ్మాయితో ఉన్న ఫొటోను రాకేష్‌ భార్య అశ్విని గమనించి ఫోన్‌ చేసింది. ఇంటికి వస్తున్నాని చెప్పిన రాకేష్‌ రాలేదు. సెల్‌ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ వస్తుండడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మహేష్

మిర్జాలగూడకు చెందిన దొడ్డి మల్లేష్‌ కుమారుడు మహేష్‌(19) ఈనెల 19వ తేదీ సెలూన్‌షాపు నిర్వహించే మల్లేష్‌కు లంచ్‌ బాక్స్‌ తీసుకొని వచ్చాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోతే ఫోన్‌ చేస్తే ఇంటికి వస్తున్నానని చెప్పాడు. ఎంతకీ రాకపోవడంతో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు