ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

14 Mar, 2021 08:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బసవకళ్యాణ కు చెందిన వినీత కాంబళే (24) బీదర్‌ నగరంలోని బ్రిమ్స్‌ మెడికల్‌ కాలేజీలో వైద్యవిద్య అభ్యసిస్తోంది. శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కారణాలు తెలియరాలేదు. బీదర్‌ న్యూటౌన్‌ పోలీసులు చేరుకుని మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.  

చైన్‌ స్నాచర్‌ అరెస్ట్‌ 
మైసూరు: చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న యువకుడితో పాటు అతని వద్ద నగలను కొనుగోలు చేస్తున్న యువతిని కూడా నంజనగూడు పోలీసుల అరెస్ట్‌ చేశారు. నిందితుడు చందన్‌ ఇటీవల ఓ బైక్‌ను అపహరించి చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. పోలీసులు నిఘా పెట్టి చందన్‌తో పాటు సుధారాణి అనే మహిళను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి మూడు చైన్లు, రెండు మొబైల్‌ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. వీరి అరెస్టులో పలు స్నాచింగ్‌ కేసులు పరిష్కారమయ్యాయి.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు