మతిస్థిమితం లేదని.. సోదరి హత్య 

12 Nov, 2022 09:13 IST|Sakshi

మైసూరు: మానసిక అస్వస్థురాలు అయిన మహిళను ఆమె సోదరి దంపతులు హతమార్చారు, సుమారు రెండు సంవత్సరాల తరువాత ఈ ఘోరం బయటపడింది. చామరాజనగరకు చెందిన లక్ష్మిని ఆమె సోదరి రూపా, భర్త సిద్దరాజుతో కలిసి హత్య చేసింది. వివరాలు.. హేమ కుమార్తె అయిన లక్షి్మని తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన రాజేష్‌కు ఇచ్చి పెళ్లి చేయగా 7 ఏళ్ల ప్రీతం అనే కుమారుడు ఉన్నాడు.

గత ఐదు సంవత్సరాల నుంచి లక్ష్మి మానసిక అస్వస్థకు గురి కావడంతో భర్త ఆమెను పుట్టింటిలో వదిలిపెట్టాడు. అక్కడ రాయనహుండి గ్రామంలో ఆమె సోదరి రూపా ఇంట్లో ఉండేది. రెండేళ్ల క్రితం లక్ష్మీకి మతిస్థిమితం పూర్తిగా కోల్పోయి ఉద్రేకంగా ప్రవర్తించసాగింది. మర్యాద పోతుందని ఆగ్రహంతో లక్ష్మీ కాళ్లు చేతులు కట్టి వేసి, నోట్లో బట్టలు కుక్కి రూపా, ఆమె భర్త సిద్దరాజు కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.

సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా లక్ష్మి ఊపిరి ఆడక చనిపోయి ఉంది. గుట్టుగా ఇంటి వెనుకాల అర్ధరాత్రి గుంత తీసి పూడ్చిపెట్టారు. ఎక్కడికో వెళ్లిపోయిందని బంధువులకు చెప్పారు. ఇటీవల తల్లి గట్టిగా నిలదీయడంతో రూపా అసలు విషయం చెప్పింది.  తల్లి వరుణా పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.  

(చదవండి: కంట్లో కారం చల్లి.. చేతులు నరికి)

మరిన్ని వార్తలు