మరోసారి బుక్కైన మిలింద్‌ సోమన్‌

7 Nov, 2020 10:39 IST|Sakshi

పనాజీ: మొన్న వివాదాస్పద ఫోటోషూట్‌ వివాదంలో మోడల్‌ నటి పూనం పాండే, ఆమె భర్తపై కేసు నమోదు కాగా ఇలాంటి మరో వివాదంతో తాజాగా మరో మోడల్‌ నటుడు మిలింద్ సోమన్‌(55) బుక్కయ్యారు. ఈ నెల 4వ తేదీన పుట్టిన రోజు సందర్బంగా గోవాలోని ఒక బీచ్‌లో నగ్నంగా పరిగెట్టిన ఫోటో వైరల్‌ కావడంతో మిలింద్‌ఫై శుక్రవారం కేసు నమోదైంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 67, ఐపీసీ సెక్షన్ 294 కింద కొల్వా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గోవా సూరక్ష మంచ్ అనే సంస్థ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నామని దక్షిణ గోవా ఎస్పీ పంకజ్ సింగ్ తెలిపారు. (బర్త్‌డే స్పెషల్‌.. బీచ్‌లో బట్టలు లేకుండా..)

అనంతరం మిలింద్‌ సోమన్‌కు బెయిల్ లభించింది. వీడియోలు లేదా చిత్రాలు, ప్రొఫెషనల్ షూట్ వారి వారి వ్యక్తిగత విషయాలు. అయినప్పటికీ, ఏదైనా అభ్యంతరం, ప్రజా ఆగ్రహం వ్యక్తమైతే  తప్ప అశ్లీలం లేదా అనైతికమైనవిగా చెప్పలేమని, భావ వ్యక్తీకరణ రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు అని బెయిల్ ఉత్తర్వులో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కెనకోనా అభిప్రాయపడ్డారు. మరోవైపు తనపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు కావడంపై మిలింద్ ఇంకా స్పందించలేదు. 

కాగా మోడలింగ్ రంగ సంచలనం మిలింద్ సోమన్‌కు వివాదాలు కొత్తేమీకాదు. ఈ తరహా ఆరోపణలను ఎదుర్కోవడం ఇది రెండవసారి. తొలిసారి బాలీవుడ్ నటి మధు సాప్రేతో కలిసి చేసిన కండోమ్ యాడ్‌అప్పట్లో పెద్ద సంచలనమే.  1995లో మధుసాప్రేతో కలిసి నగ్నంగా కొండ చిలువను మెడలో వేసుకొని నటించడం సెన్సేషన్‌గా మారింది. అయితే ఈ కేసులో14 సంవత్సరాల న్యాయ విచారణ తర్వాత వారిని నిర్దోషులుగా ప్రకటించడం గమనార్హం.

మరిన్ని వార్తలు