దారుణం: ఆరేళ్ల బాలికపై తాత, మేనమామ అత్యాచారం

11 Apr, 2021 15:55 IST|Sakshi

భోపాల్: భోపాల్ లోని కోలార్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు మన దేశంలో రక్షణ లేకుండా పోయింది. వివరాల ప్రకారం.. భోపాల్ లోని కోలార్ ప్రాంతంలో నివసిస్తున్న  మైనర్ బాలికపై తన మూడేళ్ల తమ్ముడి ఎదుటే అత్యాచారానికి గురిఅయింది. అయితే, అమ్మాయి ప్రవర్తనలో చాలా రోజుల నుంచి మార్పులను గమనించిన బాధితురాలి తల్లి ఏమి జరిగిందో గట్టిగ అడిగేసరికి జరిగినదంతా ఆమెకు చెప్పింది. షాకైన తల్లి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

భోపాల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎనిమిది రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రాణాలతో బయటపడిన ఆమె తన తల్లికి గత చాలా రోజులుగా అను భవిస్తున్న బాధ గురించి చెప్పింది. సమోసాలు ఇస్తానంటూ బాలిక మేనమామ బాలికను, ఆమె మూడేళ్ల తమ్ముడిని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడని అక్కడ అప్పటికే ఆమె తాత ఉన్నాడని తెలిపింది. తర్వాత ఇద్దరూ కలిసి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. మూడేళ్ల చిన్నారి(బాధితురాలి సోదరుడు) కళ్లముందే వారీ ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెప్పారు.

ఆరేళ్ల బాలిక రక్తస్రావం కావడంతో వారు వెంటనే గ్రహించి బాధితురాలికి, తన తమ్ముడికి సమోసా, రూ.20 ఇచ్చి విడిచిపెట్టారు. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి పంపారు. బాధితురాలు తన తల్లిదండ్రులకు ఈ విషయం గురుంచి చెప్పడానికి చాలా భయపడి, నిశ్శబ్దంగా ఉండిపోయినట్లు కోలార్ పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ కూలీలు, మద్యానికి బానిసలు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

చదవండి: 

బ్యాంకులో ఉరివేసుకున్న మహిళ మేనేజర్!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు