మైనర్‌ బాలిక కిడ్నాప్‌.. నోటిలో గుడ్డలు కుక్కి ..

24 Aug, 2021 12:06 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌లో దారుణం చోటు​ చేసుకుంది. ఓ 14 ఏళ్ల మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసిన అయిదుగురు దుండగులు సామూహిక అత్యాచారాని తెగపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘ఆదివారం రాత్రి బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇంటి వరండాలో నిద్రిస్తున్నారు. ఆ సమయంలో రాంపూర్‌లోని ఓ అయిదుగురు దుండగులు బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమె నోటిలో గుడ్డలు కుక్కి కిడ్నాప్‌ చేశారు. నిందితులలో ఒకరికి చెందిన దుకాణానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తన ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు. కాగా స్పృహలోకి వచ్చిన తర్వాత బాలిక కుంటుంబ సభ్యులకు జరిగిన ఘోరాన్ని తెలిపింది.’’ అని అన్నారు.

చదవండి: మహిళలతో చనువుగా ఫోన్‌ చేయించి అర్ధనగ్న ఫొటోలు..


ఇక ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మొత్తం ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులలో ఒకరితో బాలికకు స్నేహం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు వెల్లడించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.  బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు రాంపూర్ ఎస్పీ అంకిత్ కుమార్ తెలిపారు. అయితే ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ కాలేదని అన్నారు. అయితే కేసు తీవ్రత, చేస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఆయన చెప్పారు.

చదవండి: మధుసూదన్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో విచారణ ముమ్మరం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు