దారుణం: 12 ఏళ్ల బాలికను చంపి, చెట్టుకు వేలాడదీశారు..!

5 Aug, 2021 21:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ 12 ఏళ్ల బాలికను హత్య చేసి, చెట్టుకు వేలాడదీశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  వివరాల్లోకి వెళితే.. ఓ 12 ఏళ్ల బాలిక విదిశలోని అటవీ ప్రాంతానికి తన తల్లితో కలిసి వెళ్లినట్లు తెలిపారు. ఈ విషయాన్ని బాలిక తన తండ్రితో 11 గంటల సమయంలో చెప్పి వెళ్లినట్లు పేర్కొన్నారు.

అయితే ఈ విషయం బాధితురాలి తల్లి గమనించలేదని అన్నారు. అయితే ఆమె ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో కూరుతు కనిపించకపోవడంతో.. గ్రామస్తులతో కలిసి తండ్రి బాలిక కోసం అడవిలో వెతికినట్లు తెలిపారు. కొన్ని గంటల తరువాత ఆ చిన్నారి మృతదేహం కండువాతో చెట్టుకు వేలాడతూ కనిపించిందని పేర్క్నన్నారు.  అయితే హత్యకు ముందు అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు