మృగాళ్ల బారి నుంచి తప్పించుకుంది.. కానీ

15 Jan, 2021 16:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎట్టకేలకు ఇంటికి చేరుకున్న బాలిక

లక్నో: కామాంధుల చేతుల్లో నరకం అనుభవించిన బాలికకు ఎట్టకేలకు విముక్తి లభించింది. 13 నెలల నిరీక్షణ అనంతరం గురువారం ఆమె ఇంటికి చేరుకుంది. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు... నేపాల్‌కు చెందిన ఉప్రేత కుమార్‌ స్థానికంగా ఓ స్కూల్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పదిహేనేళ్ల బాలిక కుటుంబంతో పరిచయం పెంచుకుని, పని ఇప్పిస్తానని చెప్పి ఏడాది క్రితం ఆమెను తనతో తీసుకువెళ్లాడు. ఇక అప్పటి నుంచి బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఆ మృగాడు.. ఇటీవలే తనను ఇతర వ్యక్తులకు అమ్మేశాడు. (చదవండి: విద్యార్థినిపై మాజీ ఎమ్మెల్యే లైంగిక దాడి!)

ఈ క్రమంలో.. వారు బాధితురాలిని వ్యభిచార గృహానికి తీసుకువెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. భోజనం కూడా పెట్టకుండా ఉపవాసం ఉంచారు. దీంతో బాధను తట్టుకోలేక, ఎట్టకేలకు ఆ దుర్గార్ముల బారి నుంచి తప్పించుకున్న ఆ బాలిక ఇంటికి చేరుకుంది. ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి.. ఉప్రేత కుమార్‌ సహా మరో ముగ్గురు నిందితులు జితూ కశ్యప్‌, వరుణ్‌ తివారి, అజయ్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా బాలిక అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రికి తరలించగా.. ఆమె ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని తేలినట్లు పోలీసులు వెల్లడించారు.    

మరిన్ని వార్తలు