అమ్మాయి మైనర్‌.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు! 

22 Jul, 2021 14:36 IST|Sakshi

కేసు నమోదు చేసిన పోలీసులు

చెన్నై: తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో మైనర్ బాలికకు రెండుసార్లు వివాహమైనది. ఈ ఘటనపై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘అజిత్‌ (21) అనే వ్యక్తి, ఓ మైనర్‌ బాలిక(17) తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టగా.. బాలిక మైనర్(17) అని, ఈ ఏడాది జనవరిలో కమరాజ్‌ (34)ను వివాహం చేసుకున్నట్లు తెలిసింది. కాగా కామరాజ్‌తో బాలిక వివాహానికి నిరాకరించినట్లు, పై చదువుకుంటానని తెలిపింది.’’ అని పోనమ్మల్  పరిధిలోని మహిళ పోలీస్‌ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్‌ భవానీ తెలిపారు.

అయితే కామరాజ్‌తో కలిసి బాలిక సొంత గ్రామం కోవిల్‌పాలయంకు వెళుతుండగా.. అజిత్‌ ఆమెను అపహరించినట్లు తెలిసింది. ఇక కామరాజ్‌తో బాలికకు ఇదివరకే వివాహం జరిగినట్లు బాలిక తల్లిదండ్రులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కమరాజ్, అతని తల్లిదండ్రులు, అజిత్, బాలిక తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. అజిత్, కమరాజ్‌లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు