హైదరాబాద్‌లో మరో దారుణం.. మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసిన క్యాబ్‌ డ్రైవర్‌

5 Jun, 2022 15:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలిక అత్యాచార ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. నగరంలో ఇంకో మైనర్ బాలిక కిడ్నాప్‌కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మొగల్ పురాలో మైనర్ బాలిక(13)ను ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్‌ చేశాడు. బాలిక తన తల్లిని చూసేందుకు పహడిషరీఫ్‌కు వెళ్తుండగా లుక్మాన్‌ అనే క్యాబ్‌ డ్రైవర్‌ ఆమెను మభ్యపెట్టి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాడు, అక్కడ మరో ఇద్దరితో కలిసి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.  బాలికను ఓ రాత్రంతా వేరే చోట ఉంచి తిరిగి విడిచి పెట్టాడు.

తిరిగి ఇంటికి చేరుకున్న బాలిక జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్యాబ్‌ డ్రైవర్‌ లుక్మాన్‌ అహ్మద్‌తోపాటు అతనికి ఆశ్రయం ఇచ్చి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బయటికి రాకుండా పోలుసులు గోప్యతపాటిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బాలిక  ఇంటి నుంచి అదృశ్యమైంది. బాలిక కోసం గాలించిన కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి మొగల్ పురా పపీఎస్‌లో ఫిర్యాదు చేశారు.  లుక్మాన్‌ అనే క్యాబ్ డ్రైవర్ తనను రంగారెడ్డి జిల్లాలోని ఏదో ఊరికి తీసుకెళ్లాడని బాలిక పోలీసులకు చెప్పింది. దీంతో మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా పోలీసులు మార్చారు. 

బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ గ్రామానికి తీసుకెళ్ళి, అక్కడ తెలిసిన వ్యక్తులు ఆశ్రయం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. లుక్మాన్‌కు ఆశ్రయమిచ్చిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకున్న మొఘల్ పురా పోలీసులు నిందితులను  రిమాండ్‌కు తరలించారు. 
 

మరిన్ని వార్తలు