గర్భం దాల్చిన మైనర్ బాలిక

12 Oct, 2020 17:23 IST|Sakshi

జగిత్యాల : ప్రేమ పేరుతో  మైన‌ర్ బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేసి ఆమె మృతికి కార‌ణ‌మైన ఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది. బాలిక‌కు పురిటినొప్పులు రావడంతో బాలిక త‌ల్లి ఇంట్లోనే స్వంత వైద్యం చేసింది. ఈ ఘ‌ట‌న‌లో బాలిక‌తో పాటు శిశువు కూడా మ‌ర‌ణించగా రెండు రోజుల క్రితం మృత‌దేహాల‌ను గుట్టుచ‌ప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు శ‌వాల‌ను వెలికితాశారు. బాలిక మృతికి ప‌రోక్షంగా కార‌ణ‌మైన ఆమె త‌ల్లిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.  కాగా ఈ ఉదంతంపై స్థానికుల‌తో పాటు ద‌ళిత సంఘాలు మండిప‌డుతున్నాయి.  ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేసిన కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (క్యాంపస్‌లోనే మహిళపై లైంగిక దాడి)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు