సమోసా కోసం వెళ్లింది.. రూ.20 దొంగిలించిందని మైనర్‌ను తాళ్లతో కట్టేసి...

23 Oct, 2021 20:31 IST|Sakshi

లక్నో: సమోసా కోసం దుకాణానికి వెళ్లిన బాలిక డబ్బులు దొంగతనం చేసిందనే కారణంతో తాళ్లతో మంచానికి కట్టేశారు. ఈ అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హాపూర్‌ జిల్లాలో ఏడేళ్ల బాలిక సమోసాల కోసం షాప్‌కు వెళ్లింది. అక్కడ సమోసా కొనుక్కొని వస్తుండగా దుకాణంలో 20 రూపాయల నగదును బాలిక దొంగిలించిందని షాప్‌ యాజమాని రాకేష్‌ కుమార్‌ ఆమెపై ఆరోపణలు చేశాడు. అంతటితో ఆగకుండా మైనర్‌ బాలికను లాక్కెళ్లి రెండు చేతులను తాళ్లతో మంచానికి కట్టేశాడు.
చదవండి: హైదరాబాద్‌: సినిమాలో చూసి కారు దొంగిలించిన బీటెక్‌ విద్యార్థి..

బాలికకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె అక్కడే ఏడుస్తూ ఉండిపోయింది. ఈ విషయంపై బాలిక తండ్రి మాట్లాడుతూ.. తన కూతురు సమోసాల కోసం దుకాణంలోకి వెళ్లిందని, దొంగతనం పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. బాలిక తరుపున మాట్లాడటానికి వచ్చిన వారిని యాజమాని అసిస్టెంట్‌ బయపెట్టినట్లు తెలిపారు. ఈ విషయం చివరికి పోలీసుల వరకు చేరడంతో నిందితుడిని అరెస్టు చేశారు. అతనితోపాటు షాప్‌ అసిస్టెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: పెళ్లైన రెండు నెలలకే భార్యను రూ. ల‌క్షా 80 వేలకు అమ్మేసిన మైనర్‌

మరిన్ని వార్తలు