పదిలో రెండుసార్లు ఫెయిల్‌.. హ్యాకింగ్‌ పాఠాలు నేర్చి.. జైలు పాలు!

20 Jul, 2021 10:54 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని సిన్గ్రులి జిల్లాలో ఓ 16 ఏళ్ల మైనర్‌ బాలుడు మొబైల్‌ ఫోన్‌లను హ్యాకింగ్‌ చేసి, బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతుడటంతో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..‘‘ నిందితుడు మధ్యప్రదేశ్‌లోని మోర్వా పట్టణానికి చెందినవాడు. అతడి పుట్టిన రోజున తల్లిదండ్రులు ఓ ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. నిందితుడు పదవ తరగతి ఫెయిల్‌ అయ్యాడు. హ్యాకింగ్‌లో శిక్షణ కూడా తీసుకోలేదు.  కానీ, రోజుకు 15 గంటలపాటు యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ హ్యాకింగ్‌ చేయడం నేర్చుకున్నాడు. కెనడియన్‌ ఫోన్‌ నెంబర్‌తో ఓ వాట్సాప్‌ సృష్టించాడు.

అతను ఒక ప్రవాస భారతీయ అమ్మాయిగా నటిస్తూ.. చుట్టుపక్కల వాళ్లతో, పరిచయం ఉన్న వారితో చాట్‌ చేసేవాడు. అదే సమయంలో  వారి కాంటాక్ట్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలు, చిత్రాలు, వీడియోలతో సహా డేటాను తస్కరించి, అందులో ఏవైనా అశ్లీల వీడియోలు ఉంటే బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. కాగా ఈ విషయంపై ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే తాజాగా ఓ పొరుగు వ్యక్తి నిందితుడిపై ఫిద్యాదు చేశాడు. దీంతో అతడిని విచారించగా నేరాన్ని అంగీకరించాడని’’ మోర్వా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మనీష్ త్రిపాఠి  తెలిపారు.
 

మరిన్ని వార్తలు