తమతో పాటు ఆశ్లీల చిత్రాలు చూడలేదని.. బాలికను కిరాతకంగా రాళ్లతో కొట్టి..

22 Oct, 2021 17:17 IST|Sakshi

 గువాహటి: అశ్లీల వీడియోలు చూసేందుకు అలవాటుపడ్డ ముగ్గురు చిన్నారులు తమతో కలిసి వాటిని చూసేందుకు నిరాకరించిందని ఆరేళ్ల బాలికను అమానుషంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన అస్సాంలోని నాగావ్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన ఆ ప్రాంతంలో ఎన్నో కుటుంబాలకు ఓ హెచ్చరికలా మారింది. నిందితుల్లో ఇద్దరి వయసు 11 ఏళ్లు ఉండగా, మరొకరి వయసు 8 ఏళ్లే. జిల్లాలోని కలియాబోర్ ప్రాంతంలోని ఓ క్వారీ వద్ద టాయిలెట్‌లో బాలిక మృతదేహం బయటపడటంతో ఈ ఘటన వెలుగుచూసింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు యువకులు బాధితురాలి ఇంటి సమీపంలో నివసించేవారు. వారు గత కొంత కాలం మొబైల్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ వాటికి బానిసగా మారారు. మంగళవారం కూడా అశ్లీల వీడియోలను చూస్తూ బాధితురాలిని ఏదో పని ఉందని చెప్పి క్వారీ వద్దకు రప్పించారు. అక్కడ వారు ఆ క్లిప్‌లను తనని చూడాలని బలవంతం చేశారు. అందుకు ఆ బాలిక నిరాకరించడంతో కోపంతో ఆ ముగ్గురు ఆమెను రాళ్లతో కొట్టి కిరాతకంగా చంపారు. బాలిక మృతదేహం బయటపడటంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించినందుకు నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా అరెస్టు చేశారు.

ఆ ముగ్గురు యువకులు బాధితురాలిపై లైంగిక వేధింపులకు ప్రయత్నించారన్న అనుమానం, దీనిపై ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. ముగ్గురు బాలల్లో ఒకరు ఆన్‌లైన్‌ తరగతుల కోసం అతని తండ్రి నుంచి స్మార్ట్‌ఫోను తీసుకుని మిగతా ఇద్దరితో కలిసి అందులో నీలిచిత్రాలు చూడటం మొదలెట్టి వాటికి బానిసగా మారారని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

చదవండి: బాలికతో క్రికెట్‌ కోచ్‌ అసభ్యకర ప్రవర్తన..భుజాలు, ఇతర భాగాలను తాకుతూ..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు