మియాపూర్ ప్రేమోన్మాది దాడి కేసు: యువతి తల్లి మృతి

14 Dec, 2022 11:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌లోని ప్రేమోన్మాది దాడి కేసులో తీవ్రంగా గాయపడిన యువతి తల్లి శోభ మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. కాగా మియాపూర్‌లో సందీప్‌ అనే యువకుడు ప్రియురాలు వైభవీ ఆమె తల్లి శోభపై కత్తితో దాడి చేసి..తాను గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో గాయపడ్డ తల్లి కూతుళ్ల వైభవీ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. నిందితుడు సందీప్‌ కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నాడు. ఐతే ప్రస్తుతం సందీప్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఈఎన్‌టీ వైద్యులు తెలిపారు.

అసలేం జరిగిందంటే
గుంటూరు జిల్లా ఇసుకపల్లికి చెందిన వెంకటరాజు, శోభ దంపుతుల కుమార్తె శోభ, నిందితుడు సందీప్‌ గతంలో ప్రేమించకున్నారు. ఇంట్లో వాళ్లు మందలించడంతో సందీప్‌ని దూరంగా ఉంచడమే గాక ఆమెకు మరోకరితో వివాహం నిశ్చయించారు. వచ్చే ఆదివారం నిశ్చితార్థం కాగా, ఈ విషయం తెలుసుకున్న సందీప్‌ కోపంతో వైభవీ ఇంటికి వచ్చి గొడవ చేసి.. కత్తితో తల్లి కూతుళ్లపై దాడి చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరి అరుపులు విని స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. 

(చదవండి: ప్రియురాలికి మరోకరితో పెళ్లి....జీర్ణించుకోలేక కత్తితో దాడి..ఆ తర్వాత)

మరిన్ని వార్తలు