రాయదుర్గం ఎమ్మెల్యే అల్లుడు ఆత్మహత్య

20 Aug, 2022 12:27 IST|Sakshi

తాడేపల్లి రూరల్‌: అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆత్మహత్య చేసుకున్నారు. కాపు రామచంద్రారెడ్డి కుమార్తె భర్త అయిన మంజునాథరెడ్డి తాడేపల్లిలోని అవంతి అపార్టుమెంటులోని ఫ్లాట్‌లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కార్పొరేట్‌ ఆస్పత్రిలో భద్రపర్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. (క్లిక్: ఆర్‌జీఎఫ్‌.. ఇది మన కేజీఎఫ్‌)

మరిన్ని వార్తలు