మోడల్‌ ఆత్మహత్య.. ‘నేను సంతోషంగా లేను, ప్రశాంతత కావాలి’..

30 Sep, 2022 12:15 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో మోడల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అంధేరీ ప్రాంతంలోని ఓ హోట్‌ల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు విడిచింది. మృతురాలిని ఆకాంక్ష మోహన్‌గా(30) గుర్తించారు, వివరాలు.. మోడల్‌ ఆకాంక్ష బుధవారం రాత్రి 8 గంటల సమయంలో హోటల్‌లో చెక్ ఇన్ అయ్యింది. రాత్రికి 8 గంటలకు​ డిన్నర్ కూడా ఆర్డర్ చేసింది. అయితే గురువారం హౌస్ కీపింగ్ సిబ్బంది పలుమార్లు ఫోన్ చేసినా ఆమె తలుపు తీయలేదు. దీంతో హోటల్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. 

హోటల్‌కు చేరుకున్న పోలీసులు మాస్టర్‌ కీతో గదిని తెరిచి చూడగా మోడల్‌ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. మృతదేహం వద్ద పోలీసులు సుసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘నన్ను క్షమించండి. నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. నేను సంతోషంగా లేను. నాకు ప్రశాంతత కావాలి" అని నోట్ లో రాసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
చదవండి: ఏవో చెత్త బుద్ధి.. మహిళల ఫొటోలు తీసి ‘ఈమె ఎలా ఉంది’ అంటూ

మరిన్ని వార్తలు