సీబీసీఐడీకి కీచక వ్యవహారం 

1 Mar, 2021 10:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: ప్రత్యేక డీజీపీ రాజేశ్‌దాస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు సీబీసీఐడీకి చేరింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులను డీజీపీ త్రిపాఠి ఆదివారం జారీ చేశారు. ప్రత్యేక డీజీపీ రాజేశ్‌దాస్‌‌ తనను లైంగికంగా వేధించినట్టు మహిళా ఐఏఎస్‌ అధికారిణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం విశాఖ కమిటీ రంగంలోకి దిగింది. 

కాగా ఉన్నతాధికారులకు ఆ మహిళా ఐపీఎస్‌ ఫిర్యాదు చేయకుండా అనేక మంది అధికారులు అడ్డుకున్నట్టుగా సమాచారం. దీనికి తోడు మానవ హక్కుల కమిషన్‌ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. రెండు వారాల్లో  నివేదిక సమర్పించాలని డీజీపీ త్రిపాఠిని మానవహక్కుల కమిషన్‌ ఆదేశించింది. ఈ వ్యవహారంలో పలువురు అధికారుల ప్రమేయంపై సమాచారం వస్తుండడంతో విచారణ వేగాన్ని పెంచేందుకు డీజీపీ నిర్ణయించారు. దీంతో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

చదవండి: ఐపీఎస్‌కు డీజీపీ హోదా అధికారి వేధింపులు

మరిన్ని వార్తలు