ఎంపీపై లైంగిక వేధింపుల కేసు

12 Dec, 2020 15:33 IST|Sakshi
పాల్ఘర్‌ ఎంపీ రాజేం‍ద్ర గేవిట్‌

ముంబై : పాల్ఘర్‌ ఎంపీ రాజేం‍ద్ర గేవిట్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఎంపీకి చెందిన గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న ఓ మహిళ శుక్రవారం నవ్య నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆర్థిక సహాయం చేస్తానంటూ ఎంపీ గేవిట్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. గత నవంబర్‌లో తోటి సిబ్బంది ముందే తనను వేధింపులకు గురిచేశాడని తెలిపింది. ఇంకా ఆ ఫిర్యాదులో .. ‘‘నేను ఎంపీ గేవిట్‌, ఆయన భార్యకు చెందిన గ్యాస్‌ ఏజెన్సీలో 2004నుంచి పనిచేస్తున్నాను. అంతంత మాత్రంగా ఉన్న నా ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని జీతం పెంచుతానంటున్నాడు. తనకు సహకరిస్తే దానికి ప్రతిఫలంగా ఏం అడిగినా చేస్తానన్నాడు. ఓ ఫ్లాట్‌, నా కుమారుడి చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తానన్నాడు. ( పెద్దాయన క్రూరత్వం, నెటిజన్ల మండిపాటు)

నేను కుదరదని చెబుతూ వచ్చాను. ఆ తర్వాత చాలా రకాలుగా నన్ను వేధింపులకు గురిచేశాడు’’ అని తెలిపింది. అయితే, ఎంపీ గేవిట్‌ సదరు మహిళ చేస్తున్న లైంగిక ఆరోపణలను ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఆ మహిళతో పాటు మరి కొంతమంది 1.24 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారు. దీంతో నేను నవంబర్‌ 26వ తేదీ అదే పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టాను. వారందరినీ పోలీసులు అరెస్ట్‌  చేశారు. ఆ తర్వాత బెయిల్‌ మీద విడుదలయ్యారు. దీంతో ఆమె నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తోంది. నేను ఏ విచారణనైనా ఎదుర్కోవటానికి సిద్ధం’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు