టెన్త్‌ విద్యార్థినిని ప్రేమ పేరుతో వంచించి..

22 Jul, 2022 20:16 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రేమ పేరిట ప్లస్‌ వన్‌ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఐటీఐ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుముల్‌లైవాయిల్‌ మణికంఠాపురానికి చెందిన 15 ఏళ్ల బాలిక ప్లస్‌వన్‌ చదువుతోంది. ఈ నెల 15వ తేదీ స్కూల్‌కు వెళ్లిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు తిరుముల్‌లైవాయిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో తిరుముల్‌లైవాయిల్‌ గౌరీనగర్‌కు చెందిన ఐటీఐ విద్యార్థి ప్రవీణ్‌ (19) విద్యార్థినికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఈ క్రమంలో గత 17వ తేదీ అంబత్తూర్‌లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో విద్యార్థినిని వదిలిపెట్టి ప్రవీణ్‌ వెళ్లిపోయాడు. దీంతో విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. ప్రవీణ్‌ ప్రేమిస్తున్నానని అని చెప్పి తనపై పలుమార్లు లైంగికదాడి చేసినట్లు తెలిపింది. రంగంలోకి దిగిన పోలీసులు తిరుముల్‌లైవాయిల్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. అనంతరం తిరువళ్లూరు మహిళా కోర్టులో హాజరుపరచి పులల్‌ జైలుకు తరలించారు. 
చదవండి: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. న్యాయవాది ఆత్మహత్య

 ప్రేమ పేరుతో వంచించి..
తిరువళ్లూరు:
పదో తరగతి చదువుతున్న ఓ బాలికను గర్భవతిని చేసిన ఇద్దరు పూర్వ విద్యార్థులపై కేసు నమోదు చేసి, వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తిరువళ్లూరు పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను ఇదే స్కూల్‌లో చదివిన పూర్వ విద్యార్థులు ఇద్దరు ప్రేమ పేరిట వంచించారు. తిరువళ్లూరు నుంచి వేపంబట్టు తీసుకెళ్లి అక్కడ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇటీవల బాలిక కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరిశీలించిన వైద్యులు గర్భిణిగా నిర్ధారించడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటనపై వారు తిరువళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు విద్యార్థిని చెప్పిన వివరాల మేరకు పూర్వ విద్యార్థులపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు