వెంబడించి లైంగిక దాడి.. చెప్తే చంపేస్తా.. భర్తకు ఆలస్యంగా తెలియడంతో

1 May, 2022 18:42 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, ప్రకాశం(దొనకొండ): ఓ వివాహితపై లైంగిక దాడి జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై లైంగిక దాడి కేసుతో పాటు అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు ఎస్‌ఐ కొత్తపల్లి అంకమ్మ శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పోలేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన 22 ఏళ్ల మహిళను పుల్లలచెరువు మండలంలోని ఓ వ్యక్తికి ఇచ్చి కుటుంబ సభ్యులు వివాహం చేశారు. పుట్టింట్లో ఉన్న ఆమె గత నెల 25వ తేదీ సాయంత్రం బహిర్భూమికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన మాదిరెడ్డి వెంకటరెడ్డి వెంబండించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు ఆందోళన చెందింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న భర్త.. తనకు విడాకులు ఇవ్వాలంటూ భార్యపై ఒత్తిడి చేశాడు. చివరకు ఆమె దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డికి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ ఆదేశాల మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

చదవండి: (తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం..)

మరిన్ని వార్తలు