హాస్టల్లో మైనర్‌ బాలికపై  అత్యాచారం

15 Oct, 2020 08:18 IST|Sakshi

ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాకు చెందిన ఓ పాలిటెక్నిక్‌ కాలేజీ హాస్టల్‌లో ఓ మైనర్‌ బాలికపై కాలేజీ విద్యార్థి ఆదివారం అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడు అత్యాచారం చేస్తుండగా, అతడి మిత్రులు 8 మంది హాస్టల్‌ బయట కాపలా కాయడం గమనార్హం. వీరందరిపై ప్రభుత్వం ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంది. వీరిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించాలని జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వాన్ని కోరారు. నిందితులను కాలేజీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు కాలేజీ ప్రిన్సిపాల్‌ చెప్పారు. బాలిక హాస్టల్‌ పక్కన తన స్నేహితున్ని కలవడానికి వెళ్లగా. వారిని గమనించిన నిందితులు అతన్ని చితకబాది అనంతరం బాలికను హాస్టల్‌కు తీసుకొని వచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా