ట్రైనీ ఎయిర్‌ హోస్టెస్‌పై యువకుడి అఘాయిత్యం

4 Sep, 2021 19:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అత్యాచారం చేసి ఆ వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌

తరచూ అఘాయిత్యం చేస్తూ వేధింపులు

గుజరాత్‌లోని వేజల్‌పూర్‌లో ఘటన

అహ్మదాబాద్‌: ఇది ఇంటర్‌నెట్‌ యుగం. ప్రపంచంలోని అనేక విషయాలు అర చేతిలోని ఫోన్‌లో ఇట్టే తెలుసుకోవచ్చు. సోషల్‌ మీడియా పుణ్యమా అని ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో తెలుస్తోంది. అయితే సోషల్‌ మీడియా ద్వారా ఏర్పడిన కొన్ని స్నేహాలు మోసాలకు దారితీస్తున్నాయి. తాజాగా  గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది.  ఓ విద్యార్థి సోషల్‌ మీడియాలో పరిచయమైన ట్రెయినీ ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తుమందు కలిపిన పానీయం తాగించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

చదవండి: తీహార్‌ జైల్లో కర్రలతో కొట్టి గ్యాంగ్‌స్టర్‌ గుజ్జర్‌ హత్య


పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్‌ రాష్ట్రం వేజల్‌పూర్ ప్రాంతానికి చెందిన త్రివేది (22)కి ఏడు నెలల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి (22) పరిచయమైంది. అనంతరం వారిద్దరూ తరచూ సోషల్ మీడియాలో చాటింగ్‌ చేసేవారు. ఈ క్రమంలో తమ ఫోన్ నంబర్‌లను ఇచ్చిపుచ్చుకున్నారు. కొన్నాళ్లకు వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో త్రివేది తన ఇంటికి ఆ యువతిని పిలిచాడు. ఇంటికొచ్చిన అమ్మాయిపై మోజు పెరిగింది. దీంతో ఆమెపై కోరిక తీర్చుకోవాలని భావించి పానీయంతో మత్తు మందు  కలిపి ఇచ్చాడు. అది తాగిన యువతి స్పృహ తప్పింది. అనంతరం అతడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా నిందితుడు ఆ దృశ్యాల‌ను కెమెరాలో రికార్డు చేసి వాటిని చూపించి ఆ యువతిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు. ఆ వీడియోలతో భయపడుతూ ఆమెపై తరచూ బలత్కారం చేస్తున్నాడు. అతడి తీరుతో విసిగిపోయిన ఆ యువతి ఎట్టకేలకు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు అజిత్ త్రివేదిని వేజల్‌పూర్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

చదవండి: ఏడాదిన్నర క్రితం వివాహం, మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత ఆమెను..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు