వివాహితపై సామూహిక లైంగిక దాడి 

5 Aug, 2020 07:26 IST|Sakshi

ఆలస్యంగా బయటపడిన సంఘటన 

పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు, కేసు నమోదు

సాక్షి, పిఠాపురం: కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కామాంధులు అర్ధరాత్రి సమయంలో ఓ వివాహితపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అఘాయిత్యాన్ని బయటపెడితే చంపేస్తామని నిందితులు భయపెట్టడంతో రెండు నెలల పాటు తనకు జరిగిన అన్యాయాన్ని భరించిన వివాహిత చివరకు తన తల్లిదండ్రుల సహకారంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిఠాపురం సీఐ పి.రామచంద్రరావు కథనం ప్రకారం.. గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన ఓ వివాహిత తన భర్త పిల్లలతో కాపురం ఉంటోంది.

గతంలో తన స్థలంలో ఇల్లు కట్టుకోగా, ఇంటి నిర్మాణ సమయంలో తాపీ మేస్త్రీలుగా పని చేసిన చేశెట్టి బాలాజీ, మంతెన లచ్చ, తీడ లోవరాజు వివాహితపై కన్నేశారు. తమ కోరిక తీర్చాలంటూ బ్లాక్‌మెయిల్‌ చేసేవారు. ఇటీవల బాధితురాలి మామ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో బాధితురాలి భర్త ఆయన వెంట ఆస్పత్రిలో ఉండగా.. ఒక రోజు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు నిందితులు బలవంతంగా ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఎంత బతిమాలినా వినకుండా విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించినట్టు బాధితురాలి ఫిర్యాదు మేరకు కాకినాడ డీఎస్పీ భీమారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించి నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.  (ముగిసిన రజిత ప్రేమ ప్రయాణం)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు