12 ఏళ్లపాటు మహిళపై అత్యాచారం

18 Sep, 2022 15:48 IST|Sakshi

లక్నో: 12 ఏళ్లపాటు ఓ అమ్మాయిపై వరుసకు చిన్నాన్న (సవితి తండ్రి సోదరుడు) అయిన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. బాలికకు ఏడేళ్ల వయస్సున్నప్పుడు మొదలైన కామాంధుడి బలత్కారం.. ఆమెకు 19 ఏళ్లు వచ్చే వరకు పాల్పడుతూనే ఉన్నాడు. దాదాపు మూప్పై ఏళ్ల తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఉత్తరప్రదేశ్‌లోని అలీగడ్‌ ప్రాంతానికి చెందిన బాలికకు చిన్నప్పుడే తండ్రి మరణించాడు. దీంతో తల్లి మరొకరిని వివాహం చేసుకుంది. సవితి తండ్రి సోదరుడు బాలికపై కన్నేశాడు. ఆమెకు 7 ఏళ్లు ఉన్నప్పుడు తొలిసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణాన్ని బాలిక తన తల్లికి వివరించగా.. ఆమె మౌనంగా ఉండాలని హెచ్చరించింది. అంతేగాక కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికకు కొన్ని మాత్రలు ఇచ్చి ఆమె నోరూమూయించింది. దీంతో మరింత రెచ్చిపోయిన కామాంధుడు పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

అతనితోపాటు మరో మేనమామ కూడా చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా బాలికకు 19 ఏళ్ల వచ్చే వరకు వివిధ ప్రదేశాల్లో బాధితురాలిపై బలత్కారం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత వీలయినంత వరకు వాళ్ళని ఆపడానికి యువతి తన శాయశక్తులా ప్రయత్నించింది. ఆమెకు  2011లో ఆర్మీ జవాన్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు.పెళ్లైన తరువాత కూడా ఎప్పుడూ పుట్టింటికి వెళ్లినా వాళ్లు తనపై అత్యాచారానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
చదవండి: ఫేస్‌బుక్‌లో యువకుడితో పరిచయం.. ఇంట్లో పిల్లలు నిద్రపోతుంటే

అయితే మళ్లీ ఆ దుర్మర్గులకు చిక్కకుండా జాగ్రత్త పడింది. చివరకు మానసిక గాయాన్ని తట్టుకోలేక చివరికి తన భర్తకు తెలియజేసినట్లు ఆ మహిళ తెలిపింది. భర్త సహకారంతో 28 ఏళ్ల తర్వాత అలీఘడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఇంతకు ముందే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారని బాధితురాలు వాపోయింది. తరువాత జాతీయ మహిళా కమిషన్‌, ఎస్‌ఎస్‌పీ, ముఖ్యమంత్రి ఫిర్యాదుల పరిష్కార పోర్టల్‌ను ఆశ్రయించడం ద్వారా చివరికి పోలీసులు కేసు స్వీకరించారు. ఐపీసీ 376, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు