డ‍బ్బు విషయంలో తగాదా.. కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేసి..

19 Aug, 2021 10:57 IST|Sakshi

మహబూబ్‌నగర్‌: వనపర్తి జిల్లా విపనగండ్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. సంపత్‌ రావుపల్లికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తికి, హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌కు మధ్య డబ్బు విషయంలో గొడవ ఏర్పడింది. దీంతో చంద్రయ్య,  శ్రీకాంత్‌ను అతని కుటుంబ సభ్యులను సంపత్‌రావుపల్లిలో తన ఇంట్లో నిర్భందించాడు. అంతటితో ఆగకుండా.. కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేశాడు.  ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. భయంతో  అరుపులు, కేకలు పెట్టారు.

ఇవి విన్న చుట్టుపక్కల వారు వెంటనే డయల్‌ 100కి సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు విముక్తి కల్పించారు. పోలీసుల రాకను గమనించిన చంద్రయ్య అక్కడి నుంచి పారిపోయాడు. కాగా,బాధితులకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న విపనగండ్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు