రూ.30 లక్షలు, 1.67 కోట్ల నగలు చోరీ 

24 Aug, 2022 09:30 IST|Sakshi

మైసూరు: మైసూరు జిల్లాలోని టి.నరిసిపుర పట్టణంలో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కోట్లాది రూపాయల విలువైన బంగారు నగలు, నగదును దుండగులు లూటీ చేశారు. శ్రీనిధి డిస్ట్రిబ్యూటర్స్‌ పేరుతో ఆహార, ఔషధ ఉత్పత్తుల వ్యాపారం చేసే ఓజీ  శ్రీనివాస్‌ ఇంటిలో సోమవారం  దొంగలు పడి సుమారు రూ. 30 లక్షల నగదు, రూ. 1.67 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు.

లాకర్‌ను బద్ధలుకొట్టి
శ్రీనివాస్‌ తల్లిదండ్రుల వైద్య చికిత్స కోసం మైసూరు నగరానికి వెళ్లి, రాత్రి సుమారు 9.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. వస్తువులన్నీ చిందరవందరగా ఉండడం చూశాడు. నగలు, నగదు కనిపించలేదు, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి వెనుక వాకిలిని బద్ధలు కొట్టి దొంగలు చొరబడినట్లు గుర్తించారు.

దుర్భేధ్యమైన డిజిటల్‌ లాకర్‌ను పగలగొట్టి అందులోని నగదు, 1 కిలో బంగారం, 10 కిలోల వెండి , 70 గ్రాముల నెక్లెస్‌లను తీసుకున్నారు.  మహావీర్‌ జైన్‌ అనే కుదువ వ్యాపారి తన నగలను శ్రీనివాస్‌ ఇంట్లో లాకర్‌లో పెట్టగా అవి కూడా పోయాయి.

(చదవండి: భార్య సహకారం.. యువతిని భయపెట్టి ఐదేళ్లుగా అఘాయిత్యం)

మరిన్ని వార్తలు