కానిస్టేబుల్‌తో కలిసి కూతురుని కిడ్నాప్‌ చేసిన తల్లి!

17 Jul, 2021 15:55 IST|Sakshi

చెన్నై: తమిళనాడుకు చెందిన మరియా నాదర్‌ అనే మహిళను ఆమె తల్లి, ఓ ముగ్గురు వ్యక్తులు కలిసి కిడ్నాప్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వివరాల్లోకి వెళితే.. 2019 లో దాహిసర్‌కు చెందిన పాల్ సింగ్ నాదర్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడానికి మరియా నాదర్‌ అనే మహిళ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే పాల్ సింగ్‌ను విడిచిపెట్టి  తమిళనాడుకు చెందిన కానిస్టేబుల్‌ అరుణ్ దేవేంద్రను  వివాహం చేసుకోవాలని తల్లి కోరింది. దీనిపై పలు మార్లు తల్లి, కూతుళ్ల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.

కాగా బుధవారం కూతురిని కలువడానికి ఓ చోటుకు రమ్మని ఆమె తల్లి, మరో ముగ్గురు వ్యక్తులు కలిసి మరియాను కిడ్నాప్‌ చేశారు. అయితే భర్త పాల్‌కు మరియా సమాచారం అందించింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. తల్లి కోయిల్ అమ్మల్ దేవేంద్ర (46), అత్త పొన్ను తాయ్ (43), అరుణ్ దేవేంద్ర (26), డ్రైవర్ నాదర్ స్వామి (30)ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరచగా..కోర్టు పోలీసు కస్టడీకీ అప్పగించింది. కాగా మరియా 2019, అక్టోబర్ 22న ముంబైలో పాల్ (30)ను వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు