శివరాత్రి రోజున విషాదం: ఏమైందో తెలియదు తల్లీబిడ్డ మృతి

12 Mar, 2021 07:06 IST|Sakshi
మృతి చెందిన తల్లి, కుమార్తెలు   

అనుమానాస్పద స్థితిలో తల్లీబిడ్డ మృతి

శివరాత్రి రోజున హనుమాన్‌నగర్‌లో విషాదం 

నరసన్నపేట(శ్రీకాకుళం జిల్లా): అనుమానాస్పద స్థితిలో తల్లీబిడ్డ మృతి చెందిన ఘటన నరసన్నపేట మేజర్‌ పంచాయతీలోని హనుమాన్‌నగర్‌లో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్‌ఎన్‌పేట మండలం కొయిలాంకు చెందిన లత(21)కు హనుమాన్‌నగర్‌కు చెందిన లారీ డ్రైవర్‌ గోకవలస రమేష్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమారుడు తనీష్, కుమార్తె లాస్య(1) ఉన్నారు. గురువారం శివరాత్రి సందర్భంగా కుటుంబసభ్యులంతా ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత అందరూ భోజనం చేసి పడుకున్నారు.

లత, లాస్యలు నిద్రలోనే ఉండగా కుమారుడు తనీష్‌, సోదరుడు చిరంజీవి, తల్లి రాముతో కలిసి రమేష్‌ బయటకువెళ్లా రు.ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి లత, లాస్యలు మృతి చెందినట్లు గుర్తిం చారు. విషయం తెలుసుకున్న లత తల్లి, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని రోదించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, రమేష్‌తో పాటు తల్లి, సోదరుడు కలిసి భోజనంలో విషం కలిపి హత్య చేశారని ఆరోపించారు. లత తల్లి మద్ది కంచెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


చదవండి:
తాడుతో గొంతు నులిమి చంపి..  
కడతేరిన ‘ఫేస్‌బుక్’‌ ప్రేమ 


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు