గుంటూరులో లారీ బీభత్సం.. తల్లీకూతుళ్ల దుర్మరణం

14 Sep, 2021 18:13 IST|Sakshi

సాక్షి, గుంటూరు: తెనాలి మార్కెట్‌ యార్డులో లారీ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్లపైకి లారీ వేగంగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో కూతురితోపాటు తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. కూతురిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు