తాగొచ్చి వేధిస్తున్నాడని తల్లీ, అక్క దారుణం..

23 Jul, 2021 14:15 IST|Sakshi
గాయాలపాలైన శేఖర్‌

జోగులాంబ గద్వాల : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాగి వచ్చి వేధిస్తున్నాడనే కోపంతో యువకుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు తల్లి, అక్క. ఈ సంఘటన ఉండవెల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. బొంకూరు గ్రామానికి చెందిన శేఖర్‌ నిత్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని అతడి తల్లి మద్దమ్మ, అక్క నీలమ్మ కోపం పెంచుకున్నారు. గురువారం అర్థరాత్రి అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. శరీరం మొత్తం కాలిపోవటంతో అతడ్ని కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు